భారత్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,75,515 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,43,144 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,46,809కి చేరాయి. నిన్న ఒక్క రోజే 4వేల మంది మృతి చెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,62,317కి చేరింది.
నిన్న 3,44,776 మంది కరోనా నుంచి కోలుకోగా. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,40,46,809 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,04,893 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 83.50శాతంగా ఉంది. మరో వైపు టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నది. నిన్న 20,27,160 మందికి టీకాలు అందించగా.. ఇప్పటి వరకు 17,92,98,584 డోసులు పంపిణీ చేసింది.