భార‌త్‌లో క‌రోనా క‌రాళ నృత్యం.. రికార్డు స్థాయిలో కేసులు, మ‌ర‌ణాలు

India new corona cases today.భార‌త్ గ‌డిచిన 24 గంట‌ల్లో 17,40,550 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,32,730 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2021 4:59 AM GMT
India corona cases

భార‌త్ క‌రోనా మహ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 17,40,550 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా.. 3,32,730 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ శుక్ర‌వారం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,263 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 1,86,920 కి చేరుకుంది. నిన్న 1,93,279 కోలుకున్నారు.

దీంతో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 1,36,48,159కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 24,28,616 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా కొన‌సాగుతోంది. నిన్న 31,47,782 మందికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 13.54 కోట్ల టీకా డోసులు ప్ర‌జ‌ల‌కు అందాయి.


Next Story
Share it