భారత్‌లో కరోనా విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే క్రితం రోజుతో పోలిస్తే.. కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికి.. మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,50,110 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,29,942 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది.
నిన్న ఒక్క రోజే 3,876 మంది మృతి చెందారు. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి దేశంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,49,992కి పెరిగింది. నిన్న 3,56,082 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 1,90,27,304కి చేరింది. ప్రస్తుతం దేశంలో 37,15,221 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 82.39శాతం ఉంది. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. సోమవారం 25,03,756 మందికి టీకాలు వేయగా.. మొత్తంగా 17.27కోట్ల మందికి వ్యాక్సిన్ అందించారు.