దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,51,711 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 3,14,835 పాజిటివ్ కేసులు నిర్థారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. భారత్ లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,59,30,965కు పెరిగింది. అదే సమయంలో 2,104 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,84,657కి చేరింది.
నిన్న ఒక్క రోజే 1,78,841 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,34,54,880కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,91,428 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 22,11,334 మందికి టీకాలు ఇవ్వగా.. ఇప్పటి వరకు 13,23,30,644 డోసులు వేసినట్లు చెప్పింది.