దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసుల సంఖ్య మూడు వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,095 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 1,390 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,41,69,711కి చేరింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి పెరిగాయి. ఇప్పటి వరకు నమోదు అయిన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల శాతం 0.03గా ఉంది. ఇక రికవరీ రేటు 98.78 శాతంగా ఉండగా, రోజువారి పాజిటివిటీ రేటు 2.61శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.91శాతంగా ఉంది. నిన్న 6,553 డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. మొత్తం ఇప్పటి వరకు 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
దేశంలో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌బీబీ వేరియంట్ కారణమని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపింది.