దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. భారీగా పెరిగిన కేసులు

India new corona cases today.గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 2,95,041ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2021 5:25 AM GMT
India corona cases

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో విల‌య‌తాండ‌వం చేస్తోంది. తొలి వేవ్‌తో పోల్చితే.. రెండ‌వ వేవ్ రెట్టింపు వేగంతో విస్త‌రిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజ‌టివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. బుధ‌వారం కూడా అదే పంథా కొన‌సాగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 2,95,041ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు అయ్యాయి. భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టికి నుంచి ఒక రోజు వ్య‌వ‌ధిలో న‌మోదైన అత్య‌ధిక క‌రోనా కేసులు ఇవే. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,16,130కి చేరింది. ‌

నిన్న ఒక్క రోజే 2,023 మంది మృత్యువాత ప‌డ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,82,553కు పెరిగింది. నిన్న 1,67,457 కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కి చేరింది. రిక‌వ‌రీ రేటు 85.56శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 21,57,538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ కార్య‌క్ర‌మం వేగంగా కొన‌సాగుతోంది. మంగ‌ళ‌వారం మ‌రో 29.20 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా క‌రోనా టీకాలు పొందారు.


Next Story
Share it