స్వ‌ల్పంగా పెరిగిన కేసులు.. కొత్త‌గా ఎన్నంటే..?

India reports 276070 new cases in last 24 hours.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 20,55,010 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,76,070 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 4:40 AM GMT
India corona cases

దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,55,010 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,76,070 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కి చేరింది.

నిన్న ఒక్క రోజే 3,874 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,87,122కి చేరింది. నిన్న 3,69,077 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 2,23,55,440కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 31,29,878 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశంలో టీకా డ్రైవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 18,70,09,792 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.


Next Story
Share it