వామ్మో.. త‌గ్గుతున్న కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు

India reports 263533 New cases in last 24 hours.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 18,69,223 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,63,533 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2021 4:50 AM GMT
India corona cases

దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులు దేశంలో రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుతున్న‌ప్ప‌టికి.. మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు సంభ‌వించాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,69,223 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,63,533 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996కి చేరింది.

నిన్న ఒక్క రోజే 4,329 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైనప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక రోజు వ్య‌వ‌ధిలో ఇంత మంది మృతి చెంద‌డం ఇదే తొలిసారి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,78,719కి చేరింది. నిన్న 4,22,436 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారిని జ‌యించిన వారి సంఖ్య 2,15,96,512కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 33,53,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం దేశంలో టీకా డ్రైవ‌ర్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 18,44,53,149 డోసులు వేసినట్లు ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది.
Next Story