భారత్‌లో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా మమమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరువగా వచ్చింది. గత కొద్ది రోజుల క్రితం రోజువారి కేసులు నాలుగు లక్షలకు పైగా నమోదు కాగా.. ప్రస్తుతం మూడు లక్షలకు దిగువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21,23,782 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,40,842 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.
దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,30,132కి చేరుకుంది. నిన్న ఒక్క రోజే 3,741 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 2,99,266 లకు చేరింది. నిన్న 3,55,102 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,34,25,467కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 28,05,399 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,50,04,184 డోసులు వేసినట్లు చెప్పింది.