దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం.. 2.34ల‌క్ష‌ల కేసులు.. 1341 మ‌ర‌ణాలు

India reports 234692 new corona cases today.దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా దేశంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 5:36 AM GMT
దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం.. 2.34ల‌క్ష‌ల కేసులు.. 1341 మ‌ర‌ణాలు

దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 14,95,397 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 2,34,692 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,341 మంది మృత్యువాత ప‌డ్డారు. దేశంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,75,649కి చేరింది.

నిన్న‌ 1,23,354 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 1,26,71,220కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి వరకు మొత్తం 26,49,72,022 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో టీకా ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేశారు. నిన్న 30.04ల‌క్ష‌ల మందికి పైగా టీకాలు వేయ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు టీకాలు పొందిన వారి సంఖ్య 11.99కోట్లు దాటింది.


Next Story
Share it