దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 19,28,127 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,22,315 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,52,447కి చేరుకుంది.
నిన్న ఒక్క రోజే 4,454 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,03,720 లకు చేరింది. నిన్న 3,02,544 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,37,28,011కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 27,20,716 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు చెప్పింది.