ఆగ‌ని విజృంభ‌ణ కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports 217353 new corona cases today.భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 14,73,210 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 2,17,353 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 5:10 AM GMT
India corona cases

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉద్దృతి కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14,73,210 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా 2,17,353 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. నిన్న ఒక్క రోజే క‌రోనా కార‌ణంగా 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,74,308కి చేరింది. నిన్న‌ 1,18,302 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,25,47,866 మంది కోలుకున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా నిన్న‌టి వ‌ర‌కు 11,72,23,509 మందికి వ్యాక్సిన్లు వేశారు. నిన్న ఒక్క రోజే 27,30,359 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అలాగే దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,34,76,625 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.


Next Story
Share it