భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 21,57,857 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,11,298 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,847 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,15,235 లకు చేరింది. నిన్న 2,83,135 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,46,33,951 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 24,19,907 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 20,26,95,874 డోసులు వేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు 33,69,69,352 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.