దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,17,320 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,08,921 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 4,157 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 లకు చేరింది. నిన్న 2,95,955 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,43,50,816 కి చేరింది.
దేశంలో రికవరీ రేటు 89.26 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 20,06,62,456 డోసులు వేసినట్లు చెప్పింది.నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 22,17,320 కొవిడ్ టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 33,48,11,496 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.