దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం రోజువారి కేసుల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉండగా.. తాజాగా రెండు లక్షలకు దిగువకు నమోదయ్యాయి. మరో వైపు పెద్ద సంఖ్యలో బాధితులు వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24 గంటల్లో 20,85,112 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,96,427 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,69,48,874కి చేరుకుంది.
నిన్న ఒక్క రోజే 3,511 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,07,231 లకు చేరింది. నిన్న 3,26,850 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,40,54,861కి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 88.69శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 19,85,38,999 డోసులు వేసినట్లు చెప్పింది.