భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా.. 44 రోజుల క‌నిష్ఠానికి కేసులు

India new corona cases in last 24 hours.భార‌త్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 20,70,508 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,86,364 పాజిటివ్ కేసులు న‌మోదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 10:40 AM IST
India corona cases today

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,70,508 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,86,364 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,660 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 3,18,895 ల‌కు చేరింది. నిన్న 2,59,459 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,48,93,410 కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 23,43,152 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 90.34శాతానికి పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.42శాతంగా ఉందని, రోజు వారీ పాజిటివిటీ రేటు 9శాతానికి చేరుకుందని పేర్కొంది. వరుసగా నాలుగు రోజుల్లో పాజిటివిటీ రేటు పది శాతానికన్నా తక్కువగా ఉందని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో ఇప్పటి వరకు 20,57,20,660 డోసులు వేసిన‌ట్లు చెప్పింది.


Next Story