కరోనా విలయతాండవం.. కొత్తగా ఎన్నికేసులంటే..?
India reports 184372 new corona cases today.భారత్‌లో గడిచిన 24 గంటల్లో 14,11,758 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 1,84,372 పాజిటివ్ కేసులు నమోదు.
By తోట వంశీ కుమార్ Published on
14 April 2021 5:03 AM GMT

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,11,758 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 1,84,372 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,38,73,825కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,027 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,72,085 మందికి చేరింది. నిన్న ఒక్క రోజే 82,339 మంది కోలుకోగా.. మొత్తంగా 1,23,36.036 మంది ఈ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు.. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 26,46,528 మంది టీకాలు ఇవ్వగా.. ఇప్పటి వరకు టీకాలు తీసుకున్న వారి సంఖ్య 11,11,79,578కి చేరింది.
Next Story