దేశంలో ఆగ‌ని క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India reports 152879 new corona cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2021 10:44 AM IST
India corona cases

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 14.12లక్షల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించగా.. 1,52,879 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805కి చేరింది. నిన్న ఒక్క రోజే 839 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మ‌హ‌మ్మారి దేశంలో మొద‌లైన‌ప్ప‌టికి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,69,275కి చేరింది.

నిన్న ఒక్క రోజే 90,584 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 1,20,81,443కు చేరింది. ప్రస్తుతం దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మ‌హారాష్ట్రలో అధిక సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతున్నాయి. శ‌నివారం ఒక్క రోజే దాదాపు 58,993 వేల కేసులు న‌మోదు కాగా.. 301 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మ‌హారాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 32.88ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 57,329 మంది మ‌ర‌ణించారు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 35.19ల‌క్ష‌ల మందికి టీకా వేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా టీకా అందిన వారి సంఖ్య 10,15,95,147 కి చేరింది.


Next Story