భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం.. రికార్డు స్థాయిలో కేసులు న‌మోదు

India reports 131968 new corona cases.దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 13,64,205 క‌రోనా శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 1,31,968 పాజిటివ్ కేసులు న‌మోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 April 2021 5:14 AM GMT
corona virus

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,64,205 క‌రోనా శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా.. 1,31,968 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,60,542కు చేరింది. నిన్న ఒక్క రోజే ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా 780 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 1,67,642 కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 61,899 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,19,13,292కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో వైపు దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,43,34,262 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.


Next Story
Share it