తగ్గుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
India reports 120529 new covid 19 cases in last 24 hours.భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది.
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 4:56 AM GMTభారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 20,84,421 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 1,20,529 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 3,380 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
COVID-19 Testing Update. For more details visit: https://t.co/dI1pqvXAsZ @MoHFW_INDIA @DeptHealthRes @PIB_India @mygovindia @COVIDNewsByMIB #ICMRFIGHTSCOVID19 #IndiaFightsCOVID19 #CoronaUpdatesInIndia #COVID19 #Unite2FightCorona pic.twitter.com/AEGGUYsmJw
— ICMR (@ICMRDELHI) June 5, 2021
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,44,082 లకు చేరింది. నిన్న 1,97,894 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,67,95,549 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,55,248 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.38శాతానికి చేరుకుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.89శాతానికి పడిపోయిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.78శాతానికి పడిపోయిందని, వరుసగా 12 రోజుల్లో పది శాతానికి కన్నా తక్కువగానే నమోదైందని చెప్పారు. టీకా డ్రైవ్‌లో 22,78,60,317 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.