దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 4,73,717 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 11,793 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,18,839కి చేరింది. నిన్నకరోనా కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,047కి చేరింది.
నిన్న 9,486 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,27,87,092కి చేరింది. ప్రస్తుతం దేశంలో 96,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.57 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.49శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 19.21లక్షల మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసులను పంపిణీ చేశారు.