భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 12,08,329 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,15,736 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.28కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 630 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో దేశంలో ఈ మహమ్మారి మొదలైనప్పటి నుంచి దీని బారిన పడి మృత్యువాత పడిన వారి సంఖ్య 1,66,177కి చేరింది. నిన్న ఒక్క రోజు 59,856 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,17,92,135కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో వైపు టీకా కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8,70,77,474 డోసులు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా కొవిడ్ పరీక్షలు భారీగానే సాగుతున్నాయి.