త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా..కొత్త‌గా ఎన్నికేసులంటే..?

India Reports 114460 new covid 19 cases in last 24 hours.భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుతోంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2021 10:45 AM IST
త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా..కొత్త‌గా ఎన్నికేసులంటే..?

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 20,36,311క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,14,460 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339 కి పెరిగింది. నిన్న ఒక్క రోజే 2,677 మంది క‌రోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,46,759 ల‌కు చేరింది. నిన్న 1,89,232 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 2,69,84,781 కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 14,77,799 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.67శాతానికి చేరుకుందని ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.54శాతానికి పడిపోయిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 5.62 శాతానికి పడిపోయిందని, వరుసగా 13 రోజుల్లో పది శాతానికి కన్నా తక్కువగానే నమోదైందని చెప్పారు. టీకా డ్రైవ్‌లో 23,13,22,417 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.




Next Story