భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలై 14 నెలలు కావొస్తున్నా.. ఈ స్థాయిలో కొత్త కేసులు ఎన్నడూ నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1,25,89,067కి చేరాయి. నిన్న ఒక్క రోజే 478 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,65,101కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 52,847 మంది కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 1,16,82,136 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 7,41,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా.. దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,90,19,657 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,93,749 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,91,05,163 మందికి వ్యాక్సిన్లు వేశారు.