భారత్ కరోనా అప్‌డేట్.. భారీగా తగ్గిన కేసులు
India reported new covid-19 cases today.భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న మొన్నటి
By తోట వంశీ కుమార్
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు నిత్యం 40వేలకు పైగా నమోదు అయిన కేసులు నేడు 30వేలకు చేరాయి. నిన్నటితో పోలిస్తే.. దాదాపు 24 శాతం కేసుల సంఖ్య క్షీణించింది. గడిచిన 24 గంటల్లో 16,49,295 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 30,459 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,26,507 కు చేరింది. నిన్న ఒక్క రోజే 422 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,25,195కు చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 3, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/hXEFL5BBDN pic.twitter.com/mcQIVzfUio
నిన్న 38,887 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,08,96,354 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,04,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.38శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.39శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.85 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 61లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 47,85,44,114 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.