దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 16,40,287 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 44,643 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,56,757 కు చేరింది. నిన్న ఒక్క రోజే 464 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,26,754 కు చేరింది.
నిన్న 42,096 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,10,15,844 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.36శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.41శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.72 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 57.97లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 49.5 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.