దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,89,472 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,831 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,55,824 కు చేరింది. నిన్న ఒక్క రోజే 541 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,24,351కు చేరింది.
నిన్న 39,258 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,08,20,521 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,01,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.36శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.42శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 60,15,842 మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 47,02,98,596 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.