భారత్ కరోనా అప్‌డేట్.. మళ్లీ 40వేలు దాటిన కేసులు
India reported 41195 new corona cases today.దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో
By తోట వంశీ కుమార్ Published on
12 Aug 2021 4:30 AM GMT

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 21,24,953 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 41,195 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706 చేరింది. నిన్న ఒక్క రోజే 490 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,29,669 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 39,069 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,12,60,050 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.45శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 52.36 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story