భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 17,77,962 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 38,353 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. నిన్నటితో కేసులతో పోలిస్తే ఇది 36శాతం ఎక్కువ. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 497 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,29,179 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 40,013 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,12,20,981 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,86,351 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.45శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.16 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 41,38,646లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 51,90,80,524 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.