దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 18,86,271 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 36,571 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,23,22,258కి చేరింది. నిన్న ఒక్క రోజే 540 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,33,589కి చేరింది.
నిన్న36,555 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,15,61,635 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,63,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో 150 రోజుల కనిష్టానికి యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. జాతీయ రికవరీ రేటు 97.54శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 54.7లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.