భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 17,97,559 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 35178 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,85,857 చేరింది. నిన్న ఒక్క రోజే 440 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,32,519కి చేరింది.
నిన్న37,169 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,22,85,857 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.52శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.96 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 55,05,075 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 56,06,52,030 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.