భారత్ కరోనా అప్‌డేట్.. పెరిగిన మరణాలు
India reported 30948 new corona cases today.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు మరణాల
By తోట వంశీ కుమార్
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 15,85,681 కరోనా శాంపిళ్లను పరీక్షించగా 30,948 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234కి చేరింది. నిన్న ఒక్క రోజే 403 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,367కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) August 22, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/dNYe4ljFkP pic.twitter.com/GrUWqyK3ew
నిన్న38,487 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,16,36,469 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,53,398 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.57శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 52,23,612 లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు 58,14,89,377 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.