దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 15,11,313 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 28,204 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.19కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 373 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకుప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4.28లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న 41,511 బాధితులు కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,11,80,968 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,88,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.45శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.36శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.87 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 54,91,647లక్షల మందికి టీకా అందించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 51,45,00,268 పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.