భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం.. రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు

India records highest single day deaths in 24 hours.భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 May 2021 9:59 AM IST
భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం.. రికార్డు స్థాయిలో మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం కొన‌సాగుతోంది. గ‌త కొద్ది రోజులుగా నిత్యం మూడు వేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌గా.. తాజాగా ఒక్కరోజే 4 వేల‌కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఈ స్థాయిలో మర‌ణించ‌డం ఇదే తొలిసారి. గ‌డిచిన 24 గంట‌ల్లో 18,26,490 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 4,01,078 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్ లో వెల్ల‌డించింది. దీంతో భార‌త్‌లో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,18,92,676కి చేరింది.

నిన్న ఒక్క రోజే 4,187 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మృత్యువాత ప‌డిన వారి సంఖ్య 2,38,270కి చేరింది. నిన్న 3,18,609 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,79,30,960కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 37,23,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో మ‌హారాష్ట్ర‌లో 54,022, క‌ర్ణాట‌క‌లో 48,781, కేర‌ళ‌లో 38,460 చొప్పున ఉన్నాయి. ప్ర‌స్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 81.95 శాతం ఉండ‌గా.. మ‌ర‌ణాల రేటు 1.09 శాతంగా ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 16,73,46,544 మంది క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.


Next Story