దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మార్చి 3 ఆఖరు తేదీ. టెన్త్ పాసై, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తులో సవరణకు మార్చి 6 నుంచి 8 వరకు అవకాశం ఇస్తారు. మొత్తం పోస్టుల్లో ఏపీలో 1215 పోస్టులు, తెలంగాణలో 519 పోస్టులు న్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బీపీఎమ్, ఏబీపీఎమ్‌గా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులు ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100, ఎస్టీ, ఎస్సీ, మహిళలు, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు కలదు. బీపీఎంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు, ఏబీపీఎం రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు తేనం పొందవచ్చు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ ను సంప్రదించండి.