భారత్‌లో వేగంగా సోకే మంకీపాక్స్ గ్రేడ్-1(బి) కేసు నమోదు
భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 23 Sep 2024 2:00 PM GMTభారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయ్యింది. దాంతో.. దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య దేశంలో మూడుకి చేరింది. సోమవారం దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారించారు అధికారులు. అతను అనారోగ్యంగా ఉండటంతో అనుమానంతో అధికారులు టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. మంకీపాక్స్ గ్రేడ్-1 బీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాంగో సహా పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రెండుగా ఉన్న కేసులు.. సోమవారంతో మూడుకు చేరాయి. ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
మరో మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కట్టడి చర్యలను మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే ఎవరైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. త్వరగా చికిత్స పొందాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే బాధితులు ముందుగానే కుటుంబానికి సోకకుండా ఐసోలేట్ అవ్వాలని సూచిస్తున్నారు. కాగా.. భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి కేసు.. సెప్టెంబర్ 18న రెండో కేసు నమోదు అయ్యింది. తాజాగా సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది.