విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికి మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,94,968 మంది కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 174 మందికి పాజిటివ్ వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4, 46,80,757 కి చేరింది.
నిన్న దేశ వ్యాప్తంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి 5,30,725కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 220.16 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.