COVID-19 : దేశంలో కొన‌సాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నికేసులంటే..?

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1,573 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 March 2023 12:45 PM IST
COVID-19,India corona update

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వెయ్యి లోపు న‌మోదైన రోజువారి కేసుల సంఖ్య గ‌త వారం రోజుల నుంచి వెయ్యికి పైనే న‌మోదు అవుతున్నాయి. నిన్న‌టితో పోలిస్తే నేడు కేసుల సంఖ్యలో స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో 1,573 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 4,47,07,525కి చేరింది.

నిన్న కరోనాతో కేర‌ళ‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 5,30,841కి పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,41,65,703 మంది ఈ మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం 10,981 క్రియాశీల(యాక్టివ్‌) కేసుల ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.79 ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.

Next Story