దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,249 కొత్త కొవిడ్-19 కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,47,00,667కి చేరింది. నిన్న గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లొ ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఇద్దరు మృతి చెందారు.
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,30,818కి పెరిగింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి నుంచి 4,41,61,922 కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో పాజిటివ్ కేసులు 0.02శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.79 శాతం కాగా మరణాలు 1.19శాతంగా ఉంది. నిన్న 1,05,316 నమూనాలను పరీక్షించగా ఇప్పటి వరకు 92.07 కోట్ల COVID-19 పరీక్షలు నిర్వహించబడ్డాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు పంపిణీ చేశారు.