భారత్ కరోనా అప్‌డేట్.. భారీగా పెరిగిన మరణాలు
India Covid-19 update on December 5th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్యలో పెద్దగా
By తోట వంశీ కుమార్ Published on 5 Dec 2021 10:44 AM ISTదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్యలో పెద్దగా మార్పులేనప్పటికి మరణాల సంఖ్య మాత్రం భారీగానే నమోదు అయ్యింది. పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడమే ఇందుకు ప్రధాన కారణం. గడిచిన 24 గంటల్లో 12,26,064 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,895 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,33,255కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,796 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,73,326కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) December 5, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/pvG8sm8N6X pic.twitter.com/3hKMHGrWGB
నిన్న6,918 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,60,774కి చేరింది. ప్రస్తుతం దేశంలో 99,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.35 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 1,04,18,707 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,27,61,83,065 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.