భారత్ కరోనా అప్‌డేట్.. కేరళలో కొనసాగుతున్న విజృంభణ
India covid-19 Bulletin on September 5th.దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళ
By తోట వంశీ కుమార్ Published on 5 Sept 2021 10:15 AM ISTదేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా దేశంలో 42 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కేరళ రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదు అయ్యాయంటే.. ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన 24 గంటల్లో 17,47,476 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 42,766 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కి చేరింది. నిన్న ఒక్క రోజే 308 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,40,533కి చేరింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) September 5, 2021
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/uMAJFOTNyo pic.twitter.com/HszCeieSEj
24 గంటల వ్యవధిలో 38,091 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,21,38,092కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,10,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.42శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.62శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 71,61,760 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 68,46,69,521 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.