భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా

India covid-19 bulletin on September 27th.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. చాలా రోజుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Sept 2021 10:12 AM IST
భార‌త్‌లో త‌గ్గుముఖం ప‌డుతున్న క‌రోనా

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. చాలా రోజుల త‌రువాత 20వేల లోపు కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,21,780 క‌రోనా సాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 18,795 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 3,36,97,581 చేరింది. నిన్న ఒక్క రోజే 179 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మృతిచెందిన వారి సంఖ్య4,47,373కి చేరింది.

నిన్న 26,030 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 32,9,58,002కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 2,92,206 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.81శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.88శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.42 శాతంగా ఉంద‌ని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 1,02,22,525మందికి మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు 87,07,08,636 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.

Next Story