దేశంలో కరోనా మహ్మమారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 14,48,833 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 35,662 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,34,17,390కి చేరింది. నిన్న ఒక్క రోజే 281 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,44,529కి చేరింది.
నిన్న 33,798 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,26,32,222కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,40,639 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.65శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.02శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.46 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. కరోనా వ్యాక్సినేషన్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. ఇప్పటి వరకు 79.42 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.