దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,70,847 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 12,729 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,33,754కి చేరింది. నిన్న ఒక్క రోజే 221 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,59,873కి చేరింది.
నిన్న 12,165 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,37,24,959కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,48,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.23 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 5,65,276 మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,07,70,46,116 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.