దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 16,66,334 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 45,352 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289కి చేరింది. నిన్న ఒక్క రోజే 366 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,39,895కి చేరింది.
24 గంటల వ్యవధిలో 34,791 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,20,63,616కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,99,778 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.45శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.66శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.72 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 74.84 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 67,09,59,968 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.