భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 18 శాతం మేర పెరిగింది. గడిచిన 24 గంటల్లో 15,27,443 కరోనా సాంపిళ్లను పరీక్షించగా.. 31,923 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరింది. నిన్న ఒక్క రోజే 282 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,46,050కి చేరింది.
నిన్న 31,990 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,28,15,731కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,01,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.77శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.11శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్క రోజే 71,38,205 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తం 83,39,90,049 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.