భారత్ కరోనా అప్‌డేట్.. 30వేల దిగువకు పాజిటివ్ కేసులు
India corona bulletin on September 12th.దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,30,125
By తోట వంశీ కుమార్ Published on
12 Sep 2021 4:23 AM GMT

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,30,125 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 28,591 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కి చేరింది. నిన్న ఒక్క రోజే 338 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,42,655కి చేరింది.
24 గంటల వ్యవధిలో 34,848 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,24,09,345కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,84,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 97.51శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.17శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.87 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది. జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 72,86,883 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 73,82,07,378 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
Next Story