దేశంలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 11,76,850 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 14,313 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కి చేరింది. నిన్న ఒక్క రోజే 471 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,57,740కి చేరింది. నిన్న 13,543మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,36,41,175కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,61,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.19 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 56,91,175మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 105.43 కోట్ల డోసులను పంపిణీ చేశారు.