భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 13,40,158 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 15,906 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,75,468కి చేరింది. నిన్న ఒక్క రోజే 561 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,54,269కి చేరింది. నిన్న 16,479 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,35,48,605కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,72,594 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.17 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 77,40,676 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పటి వరకు 1,02,10,43,258 టీకా డోసులను పంపిణీ చేశారు.