నిన్నటితో పోలిస్తే నేడు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 9,23,003 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 15,981 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,40,53,573కి చేరింది. నిన్న ఒక్క రోజే 166 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,51,980 కి చేరింది. నిన్న 17,861 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,33,99,961 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,01,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 218 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 98.08 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 8,36,118 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు 97,23,77,045 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.